Andhra: రాత్రి 11 గంటల వరకు మేల్కొనే ఉన్నాడు.. కట్ చేస్తే.. తెల్లారి హాస్టల్‌ చెట్టు దగ్గర..

పరీక్షలు దగ్గర పడుతున్నాయ్. రాత్రి 11 గంటల వరకు చదువుకున్నాడు. కానీ ఆ తర్వాత తెల్లారేసరికి ఏమైందో ఏంటో తెలియదు.. ఆ వసతి గృహం దగ్గర జరగరానిది జరిగింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Andhra: రాత్రి 11 గంటల వరకు మేల్కొనే ఉన్నాడు.. కట్ చేస్తే.. తెల్లారి హాస్టల్‌ చెట్టు దగ్గర..
Representative Image

Edited By:

Updated on: Mar 03, 2026 | 1:14 PM

పరీక్షల భయం విద్యార్థులలో మామూలుగా ఉండదు. ఒకరు పరీక్షల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు పరీక్షలు రాకముందే వాటి భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి ప్రొద్దుటూరులో జరిగింది. అయితే ఇది పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక మరేదైనా కారణమా అనేది అయితే తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం స్థానికంగా విద్యార్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే అతడు పరీక్షల భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. నడింపల్లి ప్రభుత్వ బాలుర హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో చెట్టుకు ఉరి వేసుకున్న పదవ తరగతి విద్యార్థి పాలూరి నరసింహులు మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన విద్యార్ది. విద్యార్థి నరసింహులు మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొన్న రాత్రి 11 వరకు మేల్కొని ఉన్న తమ కుమారుడు ఎలా చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఇక్కడ స్థానిక విద్యార్థులు కొంతమంది చెబుతున్న సమాచారం ప్రకారం పరీక్షలు వస్తున్న నేపథ్యంలో కొంత అలజడికి లోనైన విద్యార్థి ఇలా చేసి ఉంటాడని అంటున్నారు. అయితే ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి: తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి.. ఏంటని చూడగా కళ్లు తేలేశాడు

Loading...
Unable to load recommendations.
Follow Us