Andhra Pradesh: రైల్వే ట్రాక్‌పై యువతి.. క్షణాల్లో భయానక దృశ్యం.. ఎక్కడ జరిగిందంటే..

|

Jan 02, 2022 | 8:19 PM

Andhra Pradesh: చిత్తూరు జిల్లా రేణిగుంట బుగ్గ వీధికి చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరుపతిలో ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతి..

Andhra Pradesh: రైల్వే ట్రాక్‌పై యువతి.. క్షణాల్లో భయానక దృశ్యం.. ఎక్కడ జరిగిందంటే..
Follow us on

Andhra Pradesh: చిత్తూరు జిల్లా రేణిగుంట బుగ్గ వీధికి చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరుపతిలో ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతి.. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కనిపిపంచకుండా పోయిన యువతి కోసం ప్రత్యేక బృందాలు పెట్టి గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. యువతి సెల్ ఫోన్ సిగ్నల్స్ కృష్ణాపురం రైల్వే గేట్ వద్ద చూపించింది. దీంతో పోలీసులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకనే లోపే రైల్వే ట్రాక్‌పై యువతి మృతి చెంది ఉంది. ఇంతలో ట్రైన్ రావడం, ఆమె శరీరంపై వెళ్లడంతో యువతి శరీరం ముద్దలుగా తయారైంది. అయితే, యువతికి ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటు రైల్వే పోలీసులతో పాటు.. రేణిగుంట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇంట్లో ఏవైనా ఘర్షణలు జరిగాయా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు.

Also read:

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..