West Godavari: తండ్రి సమాధి తవ్వి పుర్రె బయటకు.. ఆపై ఫోటోలు తీసి

అసలు అతడు ఇలా ఎందుకు చేశాడు..? ఏమైనా గొడవలు జరిగాయా..? అతడి మానసిక పరిస్థితి బాలేదా..? ఈ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

West Godavari: తండ్రి సమాధి తవ్వి పుర్రె బయటకు.. ఆపై ఫోటోలు తీసి
Man Digs His Fathers Grave

Updated on: Dec 17, 2022 | 4:01 PM

పోయిన సంవత్సరం ఆ యువకుడి తండ్రి చనిపోయాడు. దీంతో అందరిలానే దహనసంస్కారాలు నిర్వహించాడు కొడుకు. కానీ ఇప్పుడు అతడి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ యువకుడి వింత ప్రవర్తనకు స్థానికులు భీతిల్లిపోయారు. తండ్రి సమాధిని తవ్వి.. పుర్రెను బయటకు తీయండంతో.. ముందు అందరూ అవాక్కయ్యారు. ఇతనికేమైనా పిచ్చి పట్టిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పుర్రె బయటకు తీసి.. అంతడితో ఆగలేదు. దాన్ని ఫోటోలు తీసి తన మిత్రులకు వాట్సాప్ ద్వారా పంపాడు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే.. నరసాపురం మండలం రుస్తుంబాదలో నివశించే మురాల జయప్రసాద్‌ 2022 జులై 13న కాలం చేశాడు. వారిది ఏసును నమ్ముకున్న కుటుంబం కావడంతో..  క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసి.. సమాధి ఏర్పాటు చేశారు. అయితే అనూహ్యంగా ఈ నెల 9న జయ ప్రసాద్‌ ఫస్ట్ వైఫ్ కుమారుడైన సుజయ్‌.. తండ్రి జయప్రసాద్‌ సమాధిని తవ్వి శవపేటిక బయటకు తీశారు. ఆపై తండ్రి పుర్రెను ఫోటో తీసి ఫ్రెండ్స్‌కు సెండ్ చేశాడు.

కాగా సుజయ్‌ తమను ఇబ్బందులకు గురి చేశాడని, మానసికంగా వేధించాడని జయప్రసాద్‌ రెండో భార్య కుమారుడు సంజయ్‌ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో సుజయ్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. సుజయ్ వింతగా ఎందుకు ప్రవర్తించాడన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులు వివిధ కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..