Instagram: వీడు మామూలోడు కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా 60మంది అమ్మాయిలకు వలవేసిన కేటుగాడు..

|

Jul 15, 2022 | 12:44 PM

ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా అని వ్యక్తిగత వివరాలు చెప్పామంటే బోల్తాపడినట్లే. ఫేక్ ఎకౌంట్స్ తో అమ్మయిలను వేధిస్తారు. తాజాగా అలాంటి ఘటనే..

Instagram: వీడు మామూలోడు కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా 60మంది అమ్మాయిలకు వలవేసిన కేటుగాడు..
Arrest
Follow us on

సోషల్ మీడియాను వాడటం మంచి టైంపాస్. బోర్ కొడితే ఇన్ స్టాగ్రామ్ అలా ఓపెన్ చేశామంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కానీ సోషల్ మీడియా వాడకం అనేది కత్తిమీద సాము లాంటిది. మనకు వాడటం రాకుంటే అమాయకుల్ని చేసి కేటుగాళ్లు ఆడుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా అని వ్యక్తిగత వివరాలు చెప్పామంటే బోల్తాపడినట్లే. ఫేక్ ఎకౌంట్స్ తో అమ్మయిలను వేధిస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ అడ్డగా ఓ కేటుగాడు..ఏకంగా 60 మంది అమ్మాయిలకు వల వేశాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే నిజంగా కళ్లు బైర్లు కమ్ముతాయంతే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజమండ్రి కి చెందిన జోగడ వంశీకృష్ణ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఫెక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆ ఫెక్ అకౌంట్లతో తనను తాను హై ప్రొఫైల్ వ్యక్తి గా క్రియేట్ చేసుకుంటూ టార్గెట్ చేసిన అమ్మాయిల తో చాటింగ్ మొదలుపెట్టాడు. చాలా మంది అమ్మాయిలు సదరు కేటుగాడి ఫ్రెండ్షిప్ కోసం తపిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అలా.. 60 మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఆ తర్వాత వారి నుంచి నెమ్మదిగా డబ్బు వసూలు చేయటం మొదలు పెట్టాడు.. అలా అందరి నుంచి సుమారు 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన మోసం చేసినట్టుగా తెలిసింది.

ఈ క్రమంలోనే 25 లక్షల రూపాయలు మోసపోయిన అమెరికాలో ఉండే హైదరాబాద్ కి చెందిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు. పిటీ వారెంట్ పై కేటుగాడు జోగడ వంశీకృష్ణను అదువులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. వంశీకృష్ణ పై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడ లలో ఈ తరహా పలు కేసులు నమోదైనట్టుగా పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి