Vijayasai Reddy : తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) విదేశాల నుంచి వచ్చే విరాళాలని అడ్డుకోవడం పై రాజ్యసభ(Rajyasabha)లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy)ప్రశ్నించారు. టీటీడీకి సంబంధించి విదేశీ విరాళాలను సేకరించేందుకు అవసరమైన ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్ ను పునరుద్ధరించాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రస్థలమని.. టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అయితే టీటీడీ నిర్వహించే ఈ కార్యాకలాపాలకు భారీస్థాయిలో నిధులు అవసరమవుతాయన్నారు. తిరుమలకు విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలుగా పంపిస్తుంటారరని.. ఆ నిధులతో టీటీడీ అనేక సేవా కార్యక్రమాలను చేస్తుందని ప్రస్తావించారు. అయితే కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో విదేశీ సహకారం నియంత్రణ చట్టం( FCRA) లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. FCRA ద్వారా భారత్ లోని ఆలయాలు, స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు సేకరించుకోవచ్చు. తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ … పలు సాంకేతిక కారణాల వలన టీటీడీకి సంబంధించిన ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్ ను కేంద్ర హోంశాఖ రెన్యువల్ చేయలేదని విజయ్ సాయి రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు.
లైసెన్స్ పునరుద్ధరించకపోవడంతో 2021 డిసెంబర్ నాటికి టీటీడీకి అందాల్సిన రూ. 13.4 కోట్ల విదేశీ నిధులు బ్యాంకుల వద్దే నిలిచిపోయాయని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తక్షణమే కేంద్రహోంశాఖ స్పందించి బీజేపీ యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ హిందూ జాతీయవాదానికి టార్చ్ బేరర్‌గా చెప్పుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని విజయసాయి రెడ్డి కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
Also Read: