Andhra Pradesh: సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం కరెక్ట్ కాదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌. ఎన్నారైలను భయపెడితే ఎలా అని ప్రశ్నించారు.

Andhra Pradesh: సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం కరెక్ట్ కాదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
MLA Vasantha Krishna Prasad

Updated on: Jan 04, 2023 | 8:22 AM

సొంత పార్టీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా మైలవరం ఎమ్మెల్యే వసంత  కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గుంటూరు తొక్కిసలాట దురదృష్టకరం అన్నారు. జరిగిన ఘటనను చిలవలు, పలవలు చేసి చూడడం కరెక్ట్ కాదన్నారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు దుస్తులు పంపిణీ చేశారని, ప్రజలకు కష్టం కలగాలన్నది వారి ఉద్దేశం కాదన్నారు. ఎన్నారైలను భయపెడితే ఎలా అని ప్రశ్నించారు. ఇలాగైతే వారు సేవా కార్యక్రమాలెలా చేస్తారని ప్రశ్నించారు. NRIలు దేశంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నారైలను తక్కువ చేసి మాట్లాడ్డం కరెక్ట్‌ కాదన్నారు.  ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు.. ఉయ్యూరు శ్రీనివాస్‌ మంచి వ్యక్తి అని, తనకు చాలాకాలంగా ఫ్రెండ్ అని తెలిపారు.  పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అని చెప్పారు. అతను ఓ రాజకీయ వేదికపైకి రావడంతోనే ఇంత రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

గుంటూరు ఘటనపై అధికార వైసీపీ.. టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవల ఘటనలను సాకుగా చూపుతూ రాష్ట్రంలో ర్యాలీలు, సభలపై తీవ్ర ఆంక్షలు విధించింది.  ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మేల్యేనే తమ అధినాయకత్వం వైఖరిని తప్పుబడుతున్నట్లు మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కాగా మొన్నామధ్య ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తండ్రి, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సైతం రాజధాని సహా క్యాబినెట్‌లో కమ్మ కులానికి ప్రాతినిథ్యం లేకపోవడం, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వంటి అంశాలపై  వైసీపీని విమర్శించారు. ఆ తర్వాత తన తండ్రి వ్యాఖ్యలపై సీఎం వద్ద వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం