అరగుండు గీయించుకున్న వైసీపీ కార్యకర్త! కారణం ఏంటో చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్‌

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అరగుండు గీయించుకుంటానని స్నేహితులతో పందెం కట్టిన వైసీపీ కార్యకర్త, పార్టీ ఓడిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నాడు. అతని సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. కొందరు అతని నిర్ణయాన్ని మెచ్చుకుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ఎన్నికల పందాల ప్రమాదాల గురించి ఈ ఘటన చర్చకు దారితీసింది.

అరగుండు గీయించుకున్న వైసీపీ కార్యకర్త! కారణం ఏంటో చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్‌
Ycp Activist

Edited By: SN Pasha

Updated on: May 31, 2025 | 12:17 PM

రాజకీయాల్లో పంతం, పట్టింపులు మామూలుగా ఉండవు. సామాన్య కార్యకర్తలు జెండాను భుజాన మోస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ పార్టీకి ఓటు వేయమని అభ్యర్ధిస్తారు. తమ నేత గెలవాలని గుడి మెట్ల మీద మోకాళ్ళపై నడవటం, మొక్కు తీర్చుకోవటానికి కాలినడకన దైవ దర్శనానికి వెళ్ళటం.. ఇలా తాము నమ్ముకున్న పార్టీ గెలుపుకోసం ప్రయత్నిస్తారు. ఇక ఎన్నికల సమయంలో పందాలు కాసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఏంతో మంది ఉన్నారు. గెలుపు ఎంత కిక్ ఇస్తుందో ఓటమి అంతే బాధను మిగులుస్తుంది. స్నేహితులు, ఇతర పార్టీల నేతలతో పందెం వేసి , రచ్చబండల దగ్గర నడిచే డిబేట్ల సందర్భంలో మాటల మధ్య జోరుగా పందాలు జరుగుతాయి.

ఇలాగే తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన వైసీపీ కార్యకర్త తమ పార్టీ గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా స్నేహితులతో పందెం కాశాడు. వైసీపీ ఓడిపోతే అరగుండు చేయించకుంటానని చెప్పాడు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన తర్వాత అతను ఇప్పుడు అరగుండు గీయించకున్నాడు. అందుకు కారణం ఏంటో వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఎన్నికల ఫలితాలు వచ్చి వైసీపీ ఓడిపోయిందని తెలియగానే.. తాను ఓ మూడు నెలలు షాక్‌లోనే ఉన్నానని, ఆ తర్వాత పందెం కాసిన డబ్బులు ఇచ్చేశానని, చాలా మంది తన అరగుండు పందెం గురించి అడిగారని, కానీ నేను అప్పుడు చేయించుకోలేదని.. తన అరగుండు గురించి ఆడగే వాళ్లు ఓ ఐదు నెలల పాటు అడిగి అడిగి తర్వాత అడగడం మానేశారని ఆ కార్యకర్తం పేర్కొన్నాడు.

అయితే.. తాను జట్టు కోసం ఇంత ఆలోచిస్తున్నాను.. కానీ, పార్టీ కోసం అంత కష్టపడిన తమ నాయకుడు ఎంత బాధపడి ఉంటాడు, అందుకే ఇచ్చిన మాట కోసం ఇప్పుడు తాను అరగుండు చేయించుకున్నట్లు తెలిపాడు. అరగుండు గీయించుకొని ఎవరైతే తనతో పందెం కాశారో వారికి వీడియో కూడా పంపినట్లు తెలిపాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు తనకు ఎంతో తృప్తిగా ఉందని కూడా ఆ కార్యకర్త వెల్లడించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటివి చేయడం సరికాదని చాలా మంది అంటున్నారు. అభిమానం హద్దులు దాట కూడదని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి సందర్భంలోనే వ్యక్తుల మధ్య సమన్వయం ఉండాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎవరికి వారు వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి