ఆయన ఓ ఎమ్మెల్యే.. లక్షలాది మందికి ప్రతినిధి. ఐనా భయ పడలేదు ఆమె. ఈ ఆగ్రహం.. మాటల దాడి అంతా.. కృష్ణా జిల్లా కైకలూరు(Kaikaluru) ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపైనే(Dulam Nageshwararao). అది కూడా సొంత పార్టీకి చెందిన మహిళా లీడర్ యలవర్తి భవాని చేయడం గమనార్హం. సొంత పార్టీ మహిళనైన తనకే గౌరవం ఇవ్వని ఎమ్మెల్యే ప్రజలకు ఎలా ఇస్తాడని సభా వేధిక నుంచి నిలదీశారు. ఉగాది వేడుకల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉగాది(Ugadi) రోజు కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు తిరువీధుల శారద విందు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన భవానీ మాత్రం ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. తాను ఒక పనిపై ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే కనీస మర్యాద ఇవ్వకుండా తనను అవమానిస్తూ మాట్లాడారని ఆరోపించారు. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read
Credit Card: క్రెడిట్ కార్డును.. డెబిట్ కార్డులా వాడుతున్నారా? అయితే చిక్కులు తప్పవు!
Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..