కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

|

Jan 31, 2021 | 10:43 AM

పుట్టి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డారని ఆందోళనకు దిగారు.

కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
Follow us on

Woman died to doctors negligence : కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వలన తమ బంధువు మరణించిందని ఆరోపించారు. పుట్టి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డారని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు నిరసన చేపట్టారు.

ఈనెల 25న షేక్ ఆయేషా బీ ప్రసవం కోసం కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అదే రోజు వైద్యులు ఆమెకు సిజరిన్ ఆపరేషన్ చేశారు. అపరేషన్ అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్నందున మరోక ప్రైవేటు ఆసుపత్రికి పెషేంట్‌ను వైద్యులు తరలించారు. అయితే, అక్కడ కోలుకోలేక ఆయేషా బీ శనివారం రాత్రి మరణించింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతో ఆయేషా చనిపోయిందని కుటుంబ సభ్యులు ముడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని అర్థరాత్రి కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి వైద్యుల పై కేసు నమోదు చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే దీనిపై మా తప్పేమీ లేదని పేషెంట్‌ను బ్రతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని ఆస్పత్రి వర్గాలు వివరణ ఇస్తున్నాయి.

ఇదీ చదవండిః రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 163 మందికి కోవిడ్ పాజిటివ్