రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 163 మందికి కోవిడ్ పాజిటివ్

తెలంగాణలో గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల క్రమంగా తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,469కి చేరింది.

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 163 మందికి కోవిడ్ పాజిటివ్
Follow us

|

Updated on: Jan 31, 2021 | 9:28 AM

Telangana Corona today:   తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహ్మరి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాగా, శుక్రవారం రాత్రి 8గంటల నుంచి శనివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,469కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌‌లో వెల్లడించింది.

కాగా, శనివారం కరోనా రాకాసి బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 1,599కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 276 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,630కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,240 ఉండగా.. వీరిలో 828 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 1412 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇదిలావుంటే, నిన్న ఒక్కరోజే జీహెచ్‌ఎంసీలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు తీసుకున్న కఠిన చర్యలతో కరోనా మహమ్మారిని నియంత్రించగలిగామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పసరిగా పాటించాలని కోరారు.

Read Also… తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్‌ ఆడ్మిషన్లు.. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్

Latest Articles
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు