Baby Shower: పోలీస్‌ స్టేషనే పుట్టిల్లయింది.. మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సిబ్బంది అంతా కలిసి..

Baby Shower Celebration: తాను పని చేసే పోలీస్ స్టేషనే పుట్టిల్లుగా మారింది. ఉన్నతాధికారులు, సహచరులు తల్లిదండ్రులుగా.. తోబుట్టువులుగా మారారు.. గర్భవతిగా ఉన్న

Baby Shower: పోలీస్‌ స్టేషనే పుట్టిల్లయింది.. మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సిబ్బంది అంతా కలిసి..
Baby Shower Celebration

Updated on: Sep 13, 2021 | 6:11 AM

Baby Shower Celebration: తాను పని చేసే పోలీస్ స్టేషనే పుట్టిల్లుగా మారింది. ఉన్నతాధికారులు, సహచరులు తల్లిదండ్రులుగా.. తోబుట్టువులుగా మారారు.. గర్భవతిగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా సీమంతం చేశారు. ఒక మహిళ ఎస్పీగా, మరో మహిళ సీఐగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో.. గర్భవతిగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ల్‌ స్రవంతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే.. గర్భవతిగా ఉన్న స్రవంతికి తోటి పోలీసు సిబ్బంది అరుదైన గౌరవం దక్కేలా చేశారు. గర్భవతిగా ఉన్న స్రవంతికి పోలీస్ స్టేషన్‌లోనే ఘనంగా సీమంతం చేసి తమ కర్తవ్యాన్ని, ఔదార్యాన్ని చాటుకున్నారు. వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్న సుభాషిణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లోనే స్రవంతిని కూర్చోబెట్టి పళ్ళు, ఫలాలు సారెలతో ఘనంగా సత్కరించారు. సీఐ సుభాషిణి పట్టు చీరతో స్రవంతిని ఆశీర్వదించారు. తోటి మహిళా కానిస్టేబుళ్లు స్రవంతికి గాజులు తొడిగారు. మిగిలిన సిబ్బంది అక్షింతలు వేసి స్రవంతిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సీఐ సుభాషిణి మాట్లాడుతూ.. స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది అందరూ ఒకే కుటుంబంలా మెలుగుతామని.. దీనికి ఈ కార్యక్రమమే నిదర్శన అని పేర్కొన్నారు. సాయి స్రవంతికి సీమంతం వేడుక నిర్వహించడం.. గొప్ప పరిణామమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ అనుమతితో ఈ వేడుక నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేడుక తన బిడ్డకి నిర్వహించినంత సంతోషంగా ఉందన్నారు.

మహిళలు కుటుంబ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతో బిడియంగా ఉంటారని అయినప్పటికీ.. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేసేందుకు ముందుంటామని సీఐ సుభాషిణి తెలిపారు. సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చని.. మహిళా పోలీసులకు అండగా ఉంటామని సీఐ తెలిపారు.

Firoz, TV9 Telugu Reporter, Prakasam Dist

Also Read:

Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!