Andhra Pradesh: అసలు మతి ఉందా..? ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారి నిర్వాకం

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఆడపిల్ల పుట్టిందని రేండేళ్ళుగా భార్య కాపురానికి తీసుకెళ్లడం లేదు ఓ ప్రబుద్దుడు. అత్త-మామలు కూడా పట్టించుకోవడం లేదు.

Andhra Pradesh: అసలు మతి ఉందా..? ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారి నిర్వాకం
Wife Cheated By Husband

Updated on: Mar 23, 2022 | 9:02 AM

Guntur district: గుంటూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఆడపిల్ల పుట్టిందని రేండేళ్ళుగా భార్య కాపురానికి తీసుకెళ్లడం లేదు ఓ ప్రబుద్దుడు. వివరాల్లోకి వెళ్తే..  పెదకూరపాడు(Pedakurapadu) మండలం కాశిపాడు(Kasipadu)కు చెందిన వెంకటేశ్వరావుకి నాదెండ్ల మండలం బుక్కాపురానికి చెందిన నాగాంజలికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహా సమయంలో ఎకరన్నర పొలంతో పాటు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే కట్నకానుకలు ఇచ్చారు. ఏడాది తరువాత గర్భం దాల్చిన నాగాంజలి కాన్పు నిమిత్తం పుట్టింటికి వెళ్ళింది‌. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి కాపురానికి తీసుకెళ్ళాలని వెంకటేశ్వరరావుకు నాగాంజలి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదు. వేరే కాపురం పెట్టే విషయంలో భార్యాభర్తలు మధ్య వివాదం నడుస్తోంది. గత రెండేళ్లుగా నాగాంజలి భర్త కాపురానికి తీసుకెళ్తాడని ఆశగా ఎదురు చూసింది‌. కానీ అత్తింటి వారి వైపు నుండి చలనం లేదు.

దీంతో మార్చి 22న రెండేళ్ళ వయస్సున్న ఆడబిడ్డను తీసుకొని నాగాంజలి పెదకూరపాడు మండలం కాశిపాడులోని అత్తారింటికి వచ్చింది. అయితే నాగాంజలి రాకను తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. ఇంక చేసేదేమీ లేక ఆమె అత్తింటి ముందు బైఠాయించింది‌. ఆడ శిశువు తో ఇంటి ముందు కూర్చుని ధర్నాకు దిగింది. రాత్రంతా ఇంటి ముందే కూర్చొని ఆందోళన చేస్తున్నా  పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఆందోళన విరమించాలని పెద్దలు విజ్ఞప్తి చేసినా నాగాంజలి ససేమిరా అంటుంది.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

Also Read: వల బలంగా అనిపిస్తే ఈ రోజు పండగే అనుకున్నారు.. తీరా బయటకు తీశాక అవాక్కు

Loading...
Unable to load recommendations.
Follow Us