Andhra Pradesh: హాయ్ అని మెస్సేజ్ చేస్తే రంగంలోకి పోలీసులు.. క్షణాల్లో మీ చేతుల్లో..

పశ్చిమ గోదావరి పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు సరికొత్తగా వాట్సాప్ సేవను ప్రవేశపెట్టారు. 9154966503 నంబర్‌కు హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ చేసి, వచ్చిన లింక్‌లో వివరాలు నింపితే పోలీసులు ఫోన్‌ను రికవరీ చేసి ఇస్తారు. ఇప్పటికే 1738 ఫోన్లు రికవరీ చేశారు. ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

Andhra Pradesh: హాయ్ అని మెస్సేజ్ చేస్తే రంగంలోకి  పోలీసులు.. క్షణాల్లో మీ చేతుల్లో..
West Godavari Police Recover 126 Stolen Mobiles

Edited By: Krishna S

Updated on: Nov 15, 2025 | 12:51 PM

మీరు శివమణి సినిమా చూసారా.. అందులో ఓ నెంబర్ బాగా పాపులర్ అవుతుంది. ఎవరిదంటే ఆ ఏరియా పోలిస్‌ది. ఇక ఇపుడు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓ నెంబర్ ట్రెండ్ అవుతుంది . ఈ నెంబర్‌కి జస్ట్ హాయ్ చెప్తే చాలు పొలీసులు రంగంలోకి దిగుతున్నారు. 9154966503 వాట్సాప్ నంబర్‌కు Hi లేదా Help అని మెసేజ్ చేసి, వచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో మొబైల్ వివరాలు నింపితే చాలు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసి మీకు అందిస్తామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంటున్నారు. 11వ విడత సెల్ ఫోన్ల రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు 18,90,000 రూపాయల విలువగల 126 దొంగిలించిన లేదా చేజార్చుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంబంధిత యజమానులకు ఎస్పీ అందజేశారు. విడతల వారిగా ఇప్పటి వరకూ సుమారు 2 కోట్ల 60 లక్షల రూపాయల విలువగల మొత్తం 1738 సెల్ ఫోన్లు రికవరీ చేశారు.

ప్రజలు 9154966503 వాట్సాప్ నంబర్‌కు Hi లేదా Help అని మెసేజ్ చేస్తే లింక్ వస్తుందని.. వచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో మొబైల్ వివరాలు నింపితే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసి ఇస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మెసేజ్ చేసి వచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్‌లో వివరాలు ఇవ్వడం వల్ల పోలీసు స్టేషన్‌కి కూడా వెళ్లకుండా చోరీకి గురైన ఫోన్లను తక్షణమే తిరిగి పొందే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఈ విధానం ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొటేటప్పుడు లేదా ఫోన్ దొరికినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. దొరికింది కదా అని వాడితే చిక్కల్లో పడతారని హెచ్చరించారు.
ఫోన్ దొరికిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు. పదకొండవ విడతలో భాగంగా 126 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో కృషి చేసిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ టీమ్‌ సభ్యులు ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నిషా, రత్నారెడ్డి, వి.జి.ఎస్. కుమార్, బి.శ్రీనివాస్ సహా పలువురిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి , ప్రత్యేకంగా  అభినందించినారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..