
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతు పవనాల ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో ఇవాళ్టి నుంచి అంటే సోమవారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నైన రైతులు, కూలీలు, పశు కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద నిల్చోరాదని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. అయితే, భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అలర్ట్‌గా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఇదిలాఉంటే.. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో వర్షం కారణంగా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో సైతం మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోందన్నారు వాతావరణ కేంద్రం అంధికారులు.
మరిన్ని వాతావరణ సంబంధిత వివరాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..