Weather forecast : అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు తెలియజేశారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి :
ఉత్తర కోస్తా ఆంధ్ర, ఇంకా యానాం ప్రాంత ప్రజలకు వాతావరణ సూచనలు ::
> ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
> రేపు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
> ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (30-40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
> ఇక ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడా నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రకి వాతావరణ సూచనలు ::
> ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (30-40 kmph)వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
> రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (30-40 kmph)వేగం తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
> ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (30-40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడా నమోదయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంత ప్రజలకు వాతావరణ సూచనలు ::
> ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు.. ఇంకా ఈదురు గాలులు (30-40 kmph)వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
> రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (30-40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
ఇక, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.