Rains: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు దంచుడే దంచుడు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా వెదర్ బులిటెన్ విడుదల చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వానలు పడతాయని హెచ్చరించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం నమోదవుతోంది.

Rains: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు దంచుడే దంచుడు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక..
Rains

Updated on: Sep 18, 2026 | 6:34 AM

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో 19వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. అది దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల వైపు కదులుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని అంటున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్, మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు.

అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన వాతావరణశాఖ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు పడే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 19వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరుగుతుందని, హైదరాబాద్‌లో ఆదివారం వరకు మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. నగరంలో ఈదురుగాలులు వీచే అవకాశముందని, దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షాల క్రమంలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటివరకు కేవలం 536.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇప్పటివరకు 19 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఏపీలో భారీ వర్షాలు

ఉత్తర థాయ్‌లాండ్‌పై ఏర్పడిన ఎగువ వాయు తుఫాను వలయం వల్ల సెప్టెంబర్ 19న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇది బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయని, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల క్రమంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us