Vijayasai Reddy Scuba Diving: సాగరతీర అందాలను చూసేందుకు ప్రకృతిని ఆస్వాదించేందుకు చాలా మంది ప్రముఖులు అండమాన్ దీవులను, మాల్దీవులను సందర్శిస్తుంటారు. ఖాళీ సమయాల్లో అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ లాంటివి చేస్తుంటారు. ఎప్పుడూ రాజకీయాలతో బిజిబిజీగా ఉండే వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకృతిలో విహరించారు. అండమాన్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ.. సాగరతీర అందాలను ఆస్వాదించారు. ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం అండమాన్ నికోబార్ దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్ లో ఇలా రాశారు.
అండమాన్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. లోతైన జీవితాన్ని చూడటం పూర్తిగా అద్భుతంగా ఉందని చెప్పారు. సముద్రంలో అందమైన జీవితం మాయాజాలంతో తాను ఆశ్చర్యపోయానని విజయసాయిరెడ్డి ట్విట్‌లో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వీడియో వైరల్‌గా మారింది.
వీడియో..
It was completely amazing learning experience in the Andaman Sea watching the life 12 metres inside deep water. Scuba Diving today 6th January 2022 in the sea was thrilling as I was awestruck with the magic of beautiful life in the sea. pic.twitter.com/fCQ5ABSAzV
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 6, 2022