Andhra Pradesh: నిండా 15 ఏళ్లు లేవు.. 2,000 రూపాయల కోసం దారుణంగా చంపేశారు..!

Andhra Pradesh: నిండా పదిహేనేళ్ళు కూడా లేవు.. ఆవేశాన్ని ఆపుకోలేక ఏకంగా హత్య చేశాడు. బంగారం లాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకుని ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.

Andhra Pradesh: నిండా 15 ఏళ్లు లేవు.. 2,000 రూపాయల కోసం దారుణంగా చంపేశారు..!
Arrest

Updated on: May 20, 2022 | 12:46 PM

Andhra Pradesh: నిండా పదిహేనేళ్ళు కూడా లేవు.. ఆవేశాన్ని ఆపుకోలేక ఏకంగా హత్య చేశాడు. బంగారం లాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకుని ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి మారీస్ పేటలో సందీప్ 24వ వార్డు వాలంటీర్ గా పని చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన మైనర్.. సందీప్ వద్ద రెండు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. నిన్న సాయంత్రం సమయంలో సందీప్.. మైనర్ బాలుడు వద్దకు వెళ్ళి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగాడు.

తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమనడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో మైనర్ బాలుడు తండ్రి కూడా వచ్చాడు. ఆ వాగ్వాదం మరింత తీవ్రరూపం దాల్చింది. మాటా మాటా పెరిగి దాడుల వరకు వెళ్లింది. ఆ క్రమంలో బాలుడు, అతని తండ్రి ఇద్దరూ కలిసి సందీప్ పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సందీప్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా.. అప్పటికే ఊపిరి ఆగిపోయినట్లు నిర్ధారించుకున్నారు. స్థానిక ఆస్పత్రికి తరలించగా.. సందీప్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, బాలుడు, అతని తండ్రి కలిసి కొట్టిన దెబ్బలు గుండెపై బలంగా తగలటంతోనే సందీప్ చనిపోయాడని బాధిత కుుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us