
విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.సంతకవిటి మండలం అక్కరాపల్లి గ్రామ పరిసరాల్లో నక్క దాడి కలకలం రేపింది. పొలాల్లో పనిచేస్తున్న నలుగురు రైతులపై అకస్మాత్తుగా ఒక నక్క దాడి చేసింది. ఇది చూసిన స్థానికులు వెంటనే భయంతో పరుగులు తీశారు. అయితే ఈ నలుగురిపై దాడి చేసిన నక్కా అటు నుంచి వెళ్తూ మరో రైతుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ అతని దగ్గర దాని పప్పులు ఉడకలేదు. తనపై దాడి చేసేందుకు వచ్చిన నక్కపై ఆ రైతులు ఎదురుదాడికి దిగాడు. దీంతో రైతుకి, నక్కకి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. నక్కను రైతు పిడిగుద్దులు గుద్దాడు. రైతు దెబ్బలకు నలుగురిని గాయపరిచిన నక్క విలవిలాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది.
నక్క, రైతు మధ్య జరిగిన పెనుగులాట స్థానికులకు పెద్ద ఎత్తున భయాందోళనలను కలిగించింది. ఆ పెనుగులాటలో రైతు కూడా గాయాలపాలయ్యాడు. దీంతో నక్క కదలకుండా పడిపోవడంతో చనిపోయినట్టు నిర్ధారించుకున్న స్థానికులు వెంటనే నక్క దాడిలో గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. మొదట నక్కదాడిలో గాయపడిన వారు కూడా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇక అడవి నక్క పై వీరోచితంగా పోరాడిన రైతు ధైర్యం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అటవీ ప్రాంతాల నుంచి జంతువులు తరచూ వస్తుండటంతో రైతులు ఇక్కడ బయటకు వెళ్లడానికే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నక్క మృతితో ఒకవైపు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మరోవైపు అడవి నక్కల గుంపు దాడులు చేసే అవకాశం ఉందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే గ్రామస్థులు రాత్రి సమయంలో లైట్లు వాడటం, బయటకు వెళ్తే గ్రూపులుగా వెళ్ళడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అటవీశాఖ అధికారులు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.