
సోమవారం తెల్లవారుజామునే విషాఖలో దారుణ ఘటన వెలుగు చూసింది. గాజువాక LVనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రవీంద్ర అనే నేవి ఉద్యోగి తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో.. తన ప్రియురాలైన మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ మొదలై.. చినికి చినికి గాలివానగా మారి చివరకు హత్యకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
ప్రియురాలిని హత్య చేసేందుకు ముందుగానే రవీంద్ర ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అందుకోసం ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసి పెట్టుకున్నట్టు గుర్తించారు. అయితే అనుకున్న ప్రకారమే భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత ఆదివారం12:30- 1:00 మధ్యలో ప్రియురాలు మౌనికను రవీంద్ర ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలోనే మౌనికకు ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు రవీంద్ర. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా చేయాలని ఆమె శరీర భాగాలను తల, రెండు చేతులు, మొండెం, నడుము, కాళ్లు ఇలా మొత్తం ఐదు ముక్కలుగా వేరు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, నడుము రెండు కాళ్లు భాగాన్ని సూట్ కేసులో పెట్టినట్టు గుర్తించారు.
అయితే ఇంట్లో తల భాగం కనిపించకపోవడంతో ఆరా తీయగా.. తల చేతులు మూటగట్టి అడవివరం ప్రాంతంలో దహనం చేసినట్టు నిందితుడు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య చేసిన తర్వాత రవీంద్ర తన స్నేహితుడు సందీప్‌కి సమాచారం ఇచ్చాడని.. దీంతో అప్రమత్తమైన స్నేహితుడు రవీంద్ర భార్యతో పాటు సోదరులకు సమాచారం ఇచ్చినట్టు పోలీసుగు గుర్తించారు. ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రవీంద్రను అరెస్ట్ చేశారు.
అయితే 2020 నుంచే మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 2023 లో మౌనికకు బ్రేకప్ చెప్పానని రవీంద్ర పోలీసులకు చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆమెకు పెళ్లైందని.. అయినప్పటికీ మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని.. అందుకే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.