తగ్గేదిలేదంటోన్న ఆర్టీసీ ఎంప్లాయిస్‌.. నెక్ట్స్ స్టెప్ ఇదే..?

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరూ.. సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె చట్టవిరుద్దమని.. శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు ఎవరైతే విధుల్లో చేరని కార్మికులు ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కారని.. తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినా.. కార్మికులు మాత్రం.. సమ్మెను కొనసాగిస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేవలం 160 మంది ఎంప్లాయిస్‌ మాత్రమే విధుల్లో చేరారు. సీఎం కేసీఆర్‌ మాటను కూడా ఖాతరు చేయకుండా..! […]

తగ్గేదిలేదంటోన్న ఆర్టీసీ ఎంప్లాయిస్‌.. నెక్ట్స్ స్టెప్ ఇదే..?
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 12:52 PM

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరూ.. సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె చట్టవిరుద్దమని.. శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు ఎవరైతే విధుల్లో చేరని కార్మికులు ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కారని.. తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినా.. కార్మికులు మాత్రం.. సమ్మెను కొనసాగిస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేవలం 160 మంది ఎంప్లాయిస్‌ మాత్రమే విధుల్లో చేరారు.

సీఎం కేసీఆర్‌ మాటను కూడా ఖాతరు చేయకుండా..! మంత్రులు వార్నింగ్‌ ఇచ్చిన తరువాత.. కార్మికులు ఇలా చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో పక్క.. ఆర్టీసీ కార్మికులకు.. ఏపీఎస్ ఆర్టీసీ కూడా మద్దతు వ్యక్తం చేసింది. న్యాయమైన డిమాండ్ల సాధనకు యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో.. టీఎస్ఆర్టీసీ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారని.. ఏపీ ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ వేర్వురు ప్రకటనల్లో పేర్కొన్నాయి.

కాగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకూ.. తగ్గేది లేదంటున్నారు కార్మికులు. సమ్మెకు సై అంటే సై అని ముందుకు వెళ్తున్నారు. కాగా.. అసలే ఇప్పుడు దసరా, బతుకమ్మ పండుగల కారణంగా.. నగరవాసులు.. పల్లెబాట పట్టారు. దీనికి తోడు ఇప్పుడు సమ్మె సెగ.. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను అడ్డంగా దోచుకుంటోంది. ఇంత ఖర్చెపెట్టి ఊర్లు వెళ్తే.. మేము పండగ ఎలా చేసుకోవాలని తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

కాగా.. తాత్కాలిక, ప్రైవేటు, ఒప్పంద ఉద్యోగులను సైతం డిపోల్లోకి రానిచ్చేది లేదంటూ.. కార్మికులు తేల్చి చెప్పేశారు. నేడు ఆర్టీసీ డిపోల ముందు బతుకమ్మలతో .. నిరసన తెలియజేనున్నారు. దమ్ముంటే.. బతుకమ్మలను తొక్కించి.. బస్సులను తీసుకెళ్లాలని తెలియజేశారు. అంతేకాకుండా.. సోమవారం.. ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఈ దీక్షకు అన్ని రాజకీయ, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ.. ఆదివారం లేఖలు కూడా రాశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో