యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన.. మరో కట్టడం నెలకూలిపోయింది. అభివృద్ధి పనుల్లో భాగంగా అర్థరాత్రి.. యాదగిరి గుట్ట వైకుంఠ గోపురాన్ని అధికారులు తొలగించారు. యాదగిరి గుట్టపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్లే ప్రారంభంలో ఉన్న వైకుంఠ గోపుర ద్వారాన్ని శుక్రవారం రాత్రి కూల్చివేశారు. యాదవ్ నగర్ వరకు రోడ్డు విస్తరణ చేస్తుండటంతో.. ప్రస్తుతం వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించి ఒక జ్ఞాపకాలే మిగిలిపోనున్నాయి.
1947లో ఈ వైకుంఠ గోపురాన్ని.. రామ్‌దయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహా రెడ్డి, కొండల్ రెడ్డి, గాదె కిష్టయ్య తదితరులు ఆస్థాన కమిటీగా ఏర్పడి దీన్ని నిర్మించారు.