Breaking: కరోనాతో టీటీడీ అర్చకులు మృతి

కరోనాతో టీటీడీ అర్చకులు బీవీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. డిప్యుటేషన్‌పై గత నెలలో గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరుమలకు వెళ్లిన శ్రీనివాసచార్యులు

Breaking: కరోనాతో టీటీడీ అర్చకులు మృతి

Edited By:

Updated on: Aug 06, 2020 | 9:58 PM

TTD Priest dies of Corona: కరోనాతో టీటీడీ అర్చకులు బీవీ శ్రీనివాసాచార్యులు(48) కన్నుమూశారు. కరోనాతో నాలుగు రోజుల క్రితం ఆయన స్విమ్స్‌లో చేశారు. అప్పటికే శ్రీనివాసాచార్యులకు డయాబెటిస్‌, ఒబెసిటీ ఉండటంతో.. ఆయనను ఐసీయూకు తరలించి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై సేవలు అందించారు. ఈ క్రమంలో ఆయనకు కార్డియాక్ అరెస్టు కావడంతో వైద్యులు సిపిఆర్ వైద్యం అందించారు. అయినప్పటికీ వైద్యానికి అతని శరీరం సహకరించక పోగా.. గురువారం సాయంత్రం 4 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు శ్రీనివాసాచార్యులు మృతి పట్ల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి టీటీడీ నిబంధనల మేరకు తగిన సహాయం అందిస్తామని ఆయన అన్నారు.

Read This Story Also: కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట.. కిట్ విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం