అసలు డిమాండ్‌పైనే వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ.. ఇక..

| Edited By:

Nov 15, 2019 | 12:29 AM

దాదాపు నలభై రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ.. ఎట్టకేలకు మెట్టుదిగొచ్చింది. ఆర్టీసీ విలీన డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి. గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఇప్పటి వరకు 23 మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని.. వారి మరణాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే బలహీన వర్గాలు ఉపాధి కోల్పోతాయన్నారు. శుక్రవారం గ్రామ గ్రామాన బైక్‌ ర్యాలీలు […]

అసలు డిమాండ్‌పైనే వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ.. ఇక..
Follow us on

దాదాపు నలభై రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ.. ఎట్టకేలకు మెట్టుదిగొచ్చింది. ఆర్టీసీ విలీన డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి. గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఇప్పటి వరకు 23 మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని.. వారి మరణాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే బలహీన వర్గాలు ఉపాధి కోల్పోతాయన్నారు. శుక్రవారం గ్రామ గ్రామాన బైక్‌ ర్యాలీలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి బైక్ ర్యాలీలు చేయబోతున్నామని.. 17, 18వ తేదీల్లో డిపోల ఎదుట సామూహిక దీక్షలకు దిగుతున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఇక 19వ తేదీన హైదరాబాద్‌ టు కోదాడ సడక్‌ బంద్‌ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మె కాలంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో త్వరలో గవర్నర్‌ను కలవబోతున్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత కృష్ణారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని.. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.