కరోనా విజృంభణ.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం.!

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయి కేంద్రాల్లోనే చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు.

కరోనా విజృంభణ.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం.!

Updated on: Jun 07, 2020 | 9:13 PM

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయి కేంద్రాల్లోనే చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లోనే ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. జీవనోపాధి కోల్పోకూడదనే లాక్‌డౌన్‌ని ఎత్తేశామని, అవసరం లేకుండా బయటకి వచ్చి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంత్రి విఙ్ఞప్తి చేశారు.  వైరస్ వ్యాప్తి, నియంత్రణపై ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదని ఆయన అన్నారు.

హోమ్ క్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా హాస్పిటల్ నుంచి బయటకి రావడానికి ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకు కరోనా సోకుతుందేమోనన్న భయంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వారిని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని రాజేందర్ తెలిపారు.

Read This Story Also: Flash News: అవును ‘ఆర్ఆర్ఆర్’‌లో నటిస్తున్నా.. ఏ పాత్రంటే: శ్రియ

Loading...
Unable to load recommendations.
Follow Us