Viral Video: ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటోనని చూసి దెబ్బకు అంతా పరార్.. చివరకు..

అది ఏడడుగుల పైగా పొడవున్న భారీ గోధుమ నాగు..! పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది.. పాము చుట్టూ వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పని అయింది.. ఈ క్రమంలో నాగు పామును వల నుంచి చాకచక్యంగా బయటకు తీసిన ఆ వ్యక్తి.. పాముకు సపర్యలు చేశాడు.

Viral Video: ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటోనని చూసి దెబ్బకు అంతా పరార్.. చివరకు..
King Cobra Video

Edited By:

Updated on: Oct 01, 2024 | 6:14 PM

అది ఏడడుగుల పైగా పొడవున్న భారీ గోధుమ నాగు..! పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది.. పాము చుట్టూ వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పని అయింది.. ఈ క్రమంలో నాగు పామును వల నుంచి చాకచక్యంగా బయటకు తీసిన ఆ వ్యక్తి.. పాముకు సపర్యలు చేశాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది.. కాస్త ఆలస్యమైనా ఆ పాము ప్రాణాలు కోల్పోయేది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని సెక్టర్ 11 ఏరియా… క్వార్టర్ నెంబర్ 111.. స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఓ అధికారి.. పక్షుల బెడద నుంచి బయటపడేందుకు ఇంటి చుట్టూ వలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ.. మంగళవారం ఉదయం ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఏంటా అని వెతికారు.. చివరకు చూసి షాక్ కూడా అయ్యారు. భారీ గోధుమ నాగు ఆ వలలో చిక్కుకుంది. వల నుంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతోంది.. అయినప్పటికీ దగ్గరకు వెళ్తే బుసలు కొడతోంది.. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు.. స్నేక్ క్యాచర్ కిరణ్ కు కాల్ చేశారు.

దీంతో కిరణ్ హుటాహుటిన అక్కడకు వెళ్లి.. చూసేసరికి అప్పటికే పాము నిరసించి పోయినట్టు గుర్తించారు. ఒకవైపు నీరసించినప్పటికీ.. కోపంతో బుసలు కొడుతూ కనిపించింది.. గోధుమ నాగు శరీరమంతా వల చుట్టుకుని ఉంది.. కదలలేకపోతోంది.. ఈ క్రమంలోనే స్నేక్ క్యాచర్.. ఒక్కో వైరు తొలగించేసరికి దాదాపుగా 20 నిమిషాల సమయం పట్టింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని.. వలను కత్తిరించి ఆ పామును బయటకు తీశాడు కిరణ్ కుమార్. అనంతరం గోధుమ నాగుకు సపర్యలు చేశాడు.. వలలో చిక్కుకున్న నాగుపామును చూసి జాలి వేసినా.. దాన్ని కాపాడదామంటే కాటేస్తుంది అని భయపడ్డారు అంతా.. ఎంతైనా విష సర్పం కదా మరి. కానీ స్నేక్ క్యాచర్ కిరణ్ మాత్రం.. పసిపిల్లలా ఆ పామును అత్యంత చాకచక్యంగా వల నుంచి బయటకు తీసి.. ఊపిరి పోసాడు.

వీడియో చూడండి..

గతంలోనూ భీమిలి ప్రాంతంలో ఒక చేపల వలలో చిక్కుకునీ తీవ్ర గాయాల పాలైన కొండచిలువను బయటకు తీసి.. పశు వైద్యుడు దగ్గరకు తీసుకెళ్లి కుట్లు వేయించి వైద్యం చేయించి సపర్యలు చేశాడు కిరణ్ కుమార్. మనిషికి ఆపద ఎదురైతే నోరు విప్పి చెప్పుకుంటారు.. కానీ ఇటువంటి మూగజీవాలు చెప్పుకోలేవని.. చివరకు మూలుగుతూ ప్రాణాలు విడవడమేనని.. కిరణ్ కుమార్ పేర్కొన్నాడు.. ఏదీ ఏమైనా కిరణ్ చేసిన పనికి అంతా అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..