తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

| Edited By:

Jun 21, 2020 | 4:06 PM

ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాలలో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Follow us on

ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాలలో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ రోజు కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  అలాగే ఎల్లుండి కొన్ని చోట్ల  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
Read This Story Also: ఆ సినిమా విడుదల తరువాత 50 నంబర్లు మార్చిన సుశాంత్..!