వర్షసూచన: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

వర్షసూచన: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Edited By:

Updated on: Jun 28, 2020 | 5:49 PM

ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ , నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.