కాణిపాకంలో ప్రైవేట్ లాడ్జిల కొత్త రకం దందా

| Edited By:

Oct 11, 2020 | 10:03 AM

ఏపీలోని ప్రముఖ కాణిపాకంలో ప్రైవేట్ లాడ్జిలు కొత్తరకం దందాకు పాల్పడుతున్నారు. దేవస్థానంకు చెందిన వసతి

కాణిపాకంలో ప్రైవేట్ లాడ్జిల కొత్త రకం దందా
Follow us on

Kanipakam temple news: ఏపీలోని ప్రముఖ కాణిపాకంలో ప్రైవేట్ లాడ్జిలు కొత్తరకం దందాకు పాల్పడుతున్నారు. దేవస్థానంకు చెందిన వసతి గృహాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేవస్థానానికి చెందిన సముదాయాల్లో కరోనా రోగులను ఉంచారని అసత్య ప్రచారం చేస్తూ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాణిపాకం వచ్చే భక్తులు తమ లాడ్జీల్లో వసతి పొందేలా కొందరు ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు చేస్తున్న తీరుపై.. దేవస్థానం అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ప్రైవేట్ లాడ్జి నిర్వాహకుల తప్పుడు ప్రచారంపై దేవస్థానం స్పందించింది. కరోనా బాధితులు ఎవరికి దేవస్థానం వసతి సముదాయాలను కేటాయించలేదని ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని మాత్రమే దేవస్థానం సముదాయాల్లో వసతిని కల్పించామని వివరణ ఇచ్చింది

Read More:

పెళ్లి సందడి 2: హీరోయిన్‌గా ఖుషీ కపూర్..!

Bigg Boss 4: మోనాల్ చేష్టలు.. నాకు చాలా గలీజ్‌గా ఉందన్న అఖిల్

.