పిఠాపురం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

పిఠాపురం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Updated on: Sep 05, 2020 | 7:35 PM

MLA Dorababu Corona: ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిక విజయ్‌ శేఖర్ వెల్లడించారు. ఆరోగ్యం బాలేకపోవడంతో ఎమ్మెల్యే ఇవాళ ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు దొరబాబు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల తనను కలిసిన నాయకులు, ప్రభుత్వాధికారులు ఎవరైనా ఉంటే వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక  దొరబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌ ధైర్యంగా ఉండాలని ఆయనకు భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఏపీలో ఇప్పటివరకు 4,73,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 3,67,268 మంది కరోనాను జయించారు. 4,276మంది ఈ వైరస్‌తో మరణించగా.. ప్రస్తుతం 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

అప్పన్న బంగారం మోసం కేసు: విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

ఉద్యోగులకు ‘గూగుల్’ గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌

Loading...
Unable to load recommendations.
Follow Us