Tirumala Pedda Jeeyar Swamy: తిరుమల ఆలయ పెద్ద జీయంగార్ కరోనాను జయించారు. 72 ఏళ్ల వయస్సులో కరోనాతో పోరాడి ఆయన గెలిచారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు ఈరోజు శ్రీవారి పూజ కైంకర్యాలు, అభిషేకసేవలో పెద్ద జీయంగార్ పాల్గొననున్నారు. మరోవైపు కరోనా బారిన పడి వెంటిలేటర్పై చికిత్స పొందిన మరో అర్చకుడు ఖాధ్రిపతి నరసింహాచార్యులు కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక పెద్ద జీయంగార్, ఖాధ్రిపతిలు కోలుకోవడం పట్ల టీటీడీ అర్చకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద జీయంగార్ కోలుకోవడంతో తమలో కూడా ధైర్యం వచ్చిందని శ్రీవారి ఆలయ అర్చకులు అంటున్నారు.
Read More:
మరో విషాదం.. ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య