నరసరావు పేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధుల్లోనూ పలువురు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

నరసరావు పేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Updated on: Aug 23, 2020 | 1:40 PM

MLA tests positive for Corona: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధుల్లోనూ పలువురు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. తనకు ఒళ్లు నొప్పులు, తలనొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నెగిటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించొద్దని తెలిపారు. గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విఙ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రజలు ఎవ్వరూ అధైర్యపడొద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే వివరించారు.

Read More:

ప్రభాస్ కోసం ‘గేమ్‌ ఆఫ్ థ్రోన్స్’ టీమ్‌!

మీకెమైనా పిచ్చా.. ఫ్యాన్స్‌ వార్‌పై మండిపడ్డ సెహ్వాగ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us