ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.. రైతులకు మంత్రి భరోసా

ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. వర్షాలు కురుస్తుండటంతో

ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.. రైతులకు మంత్రి భరోసా

Edited By:

Updated on: Aug 24, 2020 | 1:16 PM

Minister Anil Kumar Yadav: ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. వర్షాలు కురుస్తుండటంతో రంగు మారే అవకాశం ఉందని అయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వరుసగా రెండోసారి జలాశయాలు నిండాయని మంత్రి అనిల్ అన్నారు. రాష్ట్రంలోని జలాశయాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది పంటలకు సమృద్ధిగా నీటిని అందిస్తామని మంత్రి అనిల్ వెల్లడించారు.

Read More:

రానా ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌!

జర్నలిస్ట్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ఫైర్‌