Vizag Zoo: ఇంటిలిజెంట్ మంకీస్.. అరుదైన కోతులను చూసేందుకే జూకు అంతమంది వస్తున్నారా..?

| Edited By: Shaik Madar Saheb

Jun 08, 2024 | 2:08 PM

విశాఖపట్నం నగరంలోని జూ కు వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఆ అరుదైన ఆఫ్రికన్ కోతులను చూసి కాసేపు ఆడి మరీ వెళ్తుండడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సాధారణంగా కోతులు ఎక్కడో ఒకచోట మనకు తగుల్తూనే ఉంటాయ్. మనతో పోటీ పడి కాసేపు కవ్వించి వెళ్తూ ఉంటాయి.

Vizag Zoo: ఇంటిలిజెంట్ మంకీస్.. అరుదైన కోతులను చూసేందుకే జూకు అంతమంది వస్తున్నారా..?
Monkeys
Follow us on

విశాఖపట్నం నగరంలోని జూ కు వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఆ అరుదైన ఆఫ్రికన్ కోతులను చూసి కాసేపు ఆడి మరీ వెళ్తుండడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సాధారణంగా కోతులు ఎక్కడో ఒకచోట మనకు తగుల్తూనే ఉంటాయ్. మనతో పోటీ పడి కాసేపు కవ్వించి వెళ్తూ ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మౌనంగా ఉంటూ ఇంటిలిజెంట్ గా వ్యవహరిస్తున్న ఆఫ్రికన్ కోతులను చూసేందుకు మాత్రం విశాఖ వాసులు, టూరిస్టులు ఆసక్తి చూపుతుండడం విశేషం.

ఆఫ్రికన్ కోతుల అక్రమ రవాణాను అడ్డుకుని జూకు తరలింపు..

ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు ఈ ఆఫ్రికన్ కోతులను విశాఖ జూ పార్కుకు అప్పగించారు. కొందరు అక్రమ వ్యాపారులు ఒడిశా రాష్ట్రం మీదుగా సముద్రపు మార్గం మీదుగా వేరే దేశానికి అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అలా వీటిని అలా వదిలేయలేక విశాఖ జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అయితే అవి ఇప్పుడు ఆకర్షణగా మారాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీటిని లోయెస్ట్ మంకీస్ అంటారట…

ఇలా అనుకోకుండా విశాఖ చేరిన వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్ క్లోజర్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారనీ క్యురేటర్ తెలిపారు. ఈ రకం జాతి కోతులు ప్రధానంగా ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయనీ, ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని నందని వివరించారు. ఈ కోతులు అరుదైన జాతికి చెందినవని తెలిపారు..

అయితే.. జూకు వచ్చిన సందర్శకులు వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..