తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు

|

Jun 24, 2020 | 7:26 AM

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్ మీదుగా బంగాళాఖాతం వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి రాయలసీమలో వర్షాలు మోస్తారు నుంచి అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో బుధ, […]

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్ మీదుగా బంగాళాఖాతం వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి రాయలసీమలో వర్షాలు మోస్తారు నుంచి అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక తెలంగాణలో బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీంతో