హుజూర్ నగర్ లో ట్రెండ్ సెట్టింగ్ సభ.. మీనింగ్ ఏంటో ?

| Edited By: Pardhasaradhi Peri

Oct 15, 2019 | 8:12 PM

కారణాలేంటో గానీ.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమదే విజమని అధికార టిఆర్ఎస్ నేతలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అందుకే 17వ తేదీన నభూతో నభవిష్యతీ అనే విధంగా గులాబీ దళాధిపతి కె.చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ శ్రేణులు. అయితే.. ఆ పార్టీకి చెందిన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ వ్యూహమేంటా అని పలు మార్లు ఆలోచించేలా చేస్తోంది. అదేంటంటారా ? హుజూర్ […]

హుజూర్ నగర్ లో ట్రెండ్ సెట్టింగ్ సభ.. మీనింగ్ ఏంటో ?
Follow us on
కారణాలేంటో గానీ.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమదే విజమని అధికార టిఆర్ఎస్ నేతలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అందుకే 17వ తేదీన నభూతో నభవిష్యతీ అనే విధంగా గులాబీ దళాధిపతి కె.చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ శ్రేణులు. అయితే.. ఆ పార్టీకి చెందిన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ వ్యూహమేంటా అని పలు మార్లు ఆలోచించేలా చేస్తోంది. అదేంటంటారా ?
హుజూర్ నగర్ లో కెసీఆర్ పాల్గొనబోయే బహిరంగ సభ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని మంగళవారం నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ట్రెండ్ సెట్టర్ అంటే ఏంటన్న చర్చకు పల్లా వ్యాఖ్యలు ట్రిగ్గర్ పాయింట్ అయ్యాయి. సాధారణంగా ఎన్నికల సందర్భంగా బహిరంగ సభల్ని ఏర్పాటు చేయడం.. భారీగా జన సమీకరణ చేయడం పరిపాటి.. తద్వారా తమకు అండగా ఇంతమంది వున్నారని చాటుకుంటూ ప్రత్యర్థులకు తమ బలాన్ని చాటుకోవడమే ఇందులో ఉద్దేశం. మరి ట్రెండ్ సెట్టింగ్ సభ అంటే ఏంటని పల్లాని అడిగితే ఆయన చాలా క్యాజువల్ గా సమాధానమిచ్చారు.