విజయవాడ నూతన సీపీగా బి శ్రీనివాసులు నియామకం

| Edited By:

Jun 15, 2020 | 11:22 AM

విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు బి శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా విజయవాడ అడిషనల్ సీపీగా పని చేస్తున్నాను. గతంలో 15 నెలలు విజయవాడ సీపీగా పని చెసా. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని‌...

విజయవాడ నూతన సీపీగా బి శ్రీనివాసులు నియామకం
Follow us on

విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు బి శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా విజయవాడ అడిషనల్ సీపీగా పని చేస్తున్నాను. గతంలో 15 నెలలు విజయవాడ సీపీగా పని చెసా. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని‌ పని చేస్తా. నాకు మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు. ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సిటీలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా. టెక్నాలజీని‌ పూర్తిగా వాడుకుని క్రిమినల్స్‌ని అరికడతాం. ఆన్ లైన్ మోసాలు, సోషల్ మీడియాలో విషప్రచారాలపై దృష్టి ఎక్కువగా ఉంచుతాం. నగరంలో నేరప్రవృతి కలిగినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీపీ బి శ్రీనివాసులు.

అలాగే మాజీ సీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో 23 నెలలు నగర కమిషనర్‌గా పని చేసినందుకు ఆనందంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్నాం. కరోనా వైరస్ నియంత్రణకు సిటీలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసాం. నేరాల నియంత్రణ చెయగలిగాం, ప్రజాసంబంధాలను మెరుగుపరుచుకున్నాం. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, మంచి జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు తిరుమల రావు.

Read More: 

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…