
గుంటూరు జిల్లా అంటేనే మిర్చి ఘాటుకు పెట్టింది పేరు. రంగు, రుచి, ఘాటులో గుంటూరు మిర్చికి మరే మిరప సరితూగదంటారు. అటువంటి గుంటూరు మిర్చికి ఇప్పుడు దేశంలోనే కాదు..విదేశాల్లోనూ గుర్తింపు లభించింది. గుంటూరు మిర్చి దేశాలు దాటి ఎగుమతి అవుతోంది. మిర్చి తరలింపు కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన రైలులో గుంటూరు మిర్చిని బంగ్లాదేశ్‌కు తరలించారు.
ఏపీలోని గుంటూరులో ఎక్కువ శాతం రైతులు మిర్చి సాగుచేస్తుంటారు. ఇక్కడి మిర్చికి దేశవిదేశాల నుంచి గిరాకీ లభిస్తోంది. 384 టన్నుల గుంటూరు మిర్చి సోమవారం బంగ్లాదేశ్ దేశానికి చేరుకుంది. ఇందుకోసం ప్రత్యేకించి ఓ రైలునే ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే…దేశంలోనే ఇదే మొట్టమొదటి పార్సిల్ రైలులో కావడం విశేషం. 16 అతి పెద్ద బోగీలున్న ఈ స్పెషల్ రైలు గుంటూరు జిల్లా రెడ్డిపాలెం నుంచి శుక్రవారం బయల్దేరింది. ఇందులో 384 టన్నుల ఎండు మిర్చిని గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు తరలించారు. ఈ రైలు 1,372 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. బంగ్లాదేశ్‌లోని బెనపోల్ ప్రాంతానికి గుంటూరు మిర్చిని చేరవేసింది. ఈ మేరకు ఆలిండియా రేడియో న్యూస్ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.
First Parcel train carrying dry chillies ? from Andhra Pradesh arrives in #Bangladesh.
The train carried 384 tonnes of dry chillies in 16 high capacity parcel vans. It covered a distance of 1372 kms after being flagged off from Reddipalem in Guntur on Friday
Report:@DhakaPrasar pic.twitter.com/6WOZhwOxWo— All India Radio News (@airnewsalerts) July 13, 2020