ఆర్కే-5బి గనిలో ప్రమాదబాధితులకు ప్రభుత్వ అండ

|

Sep 03, 2020 | 6:57 PM

మంచిర్యాల శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-5బి గనిలో జరిగిన ప్రమాదబాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గాయపడిన సింగరేణి కార్మికులను పరామర్శించారు..

ఆర్కే-5బి గనిలో ప్రమాదబాధితులకు ప్రభుత్వ అండ
Follow us on

మంచిర్యాల శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-5బి గనిలో జరిగిన ప్రమాదబాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గాయపడిన సింగరేణి కార్మికులను పరామర్శించారు ఎంపీ వెంకటేష్. బుధవారం రెండవ బదిలీలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న క్రమంలో బొగ్గు ఉత్పత్తిలో భాగంగా బ్లాస్టింగ్‌ చేసే సమయంలో ప్రమాదవశాత్తు మిర్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదంలో గాయపడ్డ పల్లె రాజయ్య, గాదె శివయ్య, చిలుక లక్ష్మణ్ కుమార్ లను హైదరాబాద్ నిజాంపేట్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, బాధితుల్ని పరామర్శించిన ఎంపీ…సంబంధిత వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం, సింగరేణి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. గాయపడిన కార్మికులకు ప్రభుత్వం, సింగరేణి సంస్థ అండగా ఉంటుందని ఎంపీ వెంకటేష్ భరోసా కల్పించారు.