
వరంగల్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. కమలాపూర్ మండలం గూడూరు శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ట్యాంకర్ బోల్తా పడింది. పొలంలో బోల్తాపడిన ట్యాంకర్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ అవుతోందటం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.