అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న రికార్డు రూమ్‌లో మంగళవారం అర్ధరాత్రి వేళ షార్ట్ సర్య్కూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం

Updated on: Aug 26, 2020 | 9:59 AM

Anantapur Government Hospital: అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న రికార్డు రూమ్‌లో మంగళవారం అర్ధరాత్రి వేళ షార్ట్ సర్య్కూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రికార్డు రూమ్‌లో ఫర్నిచర్, రికార్డులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పక్కనే కోవిడ్ వార్డులో ఉన్న 24మంది కరోనా రోగులను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్‌ సత్య యేసుబాబు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Read More:

సెంట్రల్ జైలు నుంచి కొల్లు రవీంద్ర విడుదల

ఆసుపత్రిలో చేరిన వివాదాస్పద నటి భర్త

Loading...
Unable to load recommendations.
Follow Us