కరోనా కాలం.. ఏపీలో పెరిగిన గుడ్డు ధరలు

| Edited By:

Sep 21, 2020 | 1:34 PM

కరోనా నుంచి కోలుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, అందుకు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు

కరోనా కాలం.. ఏపీలో పెరిగిన గుడ్డు ధరలు
Follow us on

Egg Price increase: కరోనా నుంచి కోలుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, అందుకు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. పోషకాహారంలో గుడ్డు కూడా ఉండటంతో.. ఇళ్లలో దీని వినియోగం పెరిగింది. చాలా మంది తమ ఆహారంలో గుడ్డు ఉండేలా చూసుకుంటున్నారు. అటు క్వారంటైన్‌లో ఉండేవారికి కూడా గుడ్డును రోజు ఇస్తున్నారు. అయితే ఏపీలో గుడ్ల ఉత్పత్తి 50 శాతం వరకు తగ్గిపోవడం, స్థానిక వినియోగం పెరగడంతో ఇప్పుడు ధరలు పెరిగాయి. ఒక్కొక్క గుడ్డు ధర రూ.6లు పలుకుతోంది.

అయితే కరోనా సోకిన మొదట్లో అపోహల వలన మాంసం, గుడ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో కోళ్లను కొనేవారు లేక, వాటిని పోషించ లేక పౌల్ట్రీ నిర్వాహకులు నష్టపోయారు. ఆ సమయంలో నష్టాలకు గుడ్లను అమ్ముకున్నారు. ఇక సగటున 2,170 కోట్లతో గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీలో ఆరు నెలలుగా చాలా కోళ్లపోరాల్లో ఉత్పత్తిని 40 నుంచి 50శాతానికి పరిమితం చేశారు. ఇప్పుడు స్థానికంగా వినియోగం పెరగడంతో రేట్లు పెరిగాయని నెక్ గోదావరి జోన్ ఛైర్మన్ గంగాధర్ తెలిపారు.

Read More:

ప్రభాస్‌ ‘ఆదిపురుష్’‌.. లక్ష్మణుడిగా దక్షిణాది యంగ్ హీరో..!

షాకింగ్‌.. లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం