Biryani offer: విశాఖలో 5 పైసలకే బిర్యానీ.. త్వరలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..

Biryani offer: ఆదివారం వచ్చిందంటే చాలు అందరు బిర్యానివైపే చూస్తారు. రెస్టారెంట్లు మొత్తం కిటకిటలాడుతాయి. చిన్న పిల్లాడి నుంచి పెద్దవారి వరకు బిర్యాని అంటే చాలు నోరూరుతుంది. కానీ

Biryani offer: విశాఖలో 5 పైసలకే బిర్యానీ.. త్వరలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..
Biryani

Updated on: Feb 20, 2022 | 4:41 PM

Biryani offer: ఆదివారం వచ్చిందంటే చాలు అందరు బిర్యానివైపే చూస్తారు. రెస్టారెంట్లు మొత్తం కిటకిటలాడుతాయి. చిన్న పిల్లాడి నుంచి పెద్దవారి వరకు బిర్యాని అంటే చాలు నోరూరుతుంది. కానీ అందరు బిర్యాని తినడం సాధ్యం కాదు. ఎందుకంటే ధరలు మండిపోతాయి. ముఖ్యంగా పేదవారికి ఇది సాధ్యంకాదు. అందుకే విశాఖపట్నంలో ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు ఐదు పైసలకే బిర్యాని ప్రవేశపెట్టారు. పేదవాడు కూడా బిర్యాని తినాలని ఆ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ప్రతి ఆదివారం మాత్రమే ఉంటుంది. త్వరంలో దీనిని పొడగిస్తూ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. దీంతో ఈ రెస్టారెంట్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ సెక్టర్ 1 వెంకిజి పాలెం దగ్గర ఉన్న పద్మావతి రెస్టారెంట్ ఐదు పైసల బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. దీంతో జనాలు ఆ హోటల్ ముందు క్యూకట్టారు. జనాలు భారీగా రావడంతో హోటల్ రద్దీగా మారింది. ప్రతి పేదవాడికి బిర్యాని అందజేయడమే తమ లక్ష్యమని హోటల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు గతంలో తమిళనాడులోని మధురై జిల్లాలో కూడా ఐదు పైసలకే బిర్యాని ప్రారంభించారు. కానీ వీరు ఒక వింత షరతు పెట్టారు. కేవలం ఐదు పైసల కాయిన్‌ తీసుకొని వస్తేనే బిర్యాని పెడతామన్నారు. వీరు ఏ ఉద్దేశ్యంతో ఇలా ప్రకటించారో తెలియదు కానీ చాలామంది చెల్లని ఐదు పైసల నాణేలు తీసుకొని హోటల్‌ ముందు క్యూ కట్టడం విశేషం. అవాక్కైన హోటల్‌ నిర్వాహకులు నోరెళ్లబెట్టారు. తప్పక బిర్యాని అందించారు.

Desi Ghee: శీతాకాలంలో వేధించే ఈ ఆరోగ్య సమస్యలకి నెయ్యితో చికిత్స.. అవేంటంటే..?

Hyderabad: నగరంలో ఇకపై ఆ ఆటోలకి అనుమతి లేదు.. కారణం ఏంటో తెలుసా..?

Viral Photos: కుక్కలంటే కొంతమందికి ఇష్టం.. మరికొంతమందికి పిచ్చి.. ఈ ఫొటోలు చూస్తే ఒప్పుకోక తప్పదు..?