లక్షణాలు లేకుండానే కరోనా.. ఏపీలో 19.7 శాతం మందికి వచ్చి పోయింది!

|

Sep 11, 2020 | 12:23 PM

ఏపీలో సీరో సర్వైలైన్స్‌ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

లక్షణాలు లేకుండానే కరోనా.. ఏపీలో 19.7 శాతం మందికి వచ్చి పోయింది!
Follow us on

AP Sero Surveillance: ఏపీలో సీరో సర్వైలైన్స్‌ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చినట్లు సర్వేలో తేలింది. పట్టణాల్లో 22.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందని స్పష్టమైంది. కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిందని అధికారులు అన్నారు. కరోనా వచ్చిపోయినవారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాలో సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొదటి విడతలో నాలుగు, రెండో విడతలో ఐదు జిల్లాలో.. కరోనా టెస్టులు చేశామని, గతంలో ఎలాంటి కోవిడ్ టెస్టులకు వెళ్లనివారినే సర్వైలెన్స్‌ టెస్టుకు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 19.7 శాతం మంది కరోనా బారిన పడి.. బయటపడ్డారని వెల్లడించారు. వీరిలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని, ప్రతీ జిల్లాలో ఐదు వేల మందికి సీరో సర్వైలైన్స్ టెస్ట్ నిర్వహించామని అధికారులు తెలిపారు.

కాగా, త్వరలోనే కర్నూలు, విజయనగరం, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని.. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందని.. దీన్ని సీరో సర్వే ద్వారా అంచనా వేయడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తామని, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..