కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్…సీఎం కీలక నిర్ణయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 2:33 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురును అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకణపై జగన్ సర్కార్

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్...సీఎం కీలక నిర్ణయం
Follow us on

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురును అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకణపై జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ దిశగా చర్యలు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. వైద్యారోగ్యం..స్త్రీ శిశు సంక్షేమం.. విద్యా.. అటవీ.. గిరిజన సంక్షేమం.. న్యాయశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలు బయటకు తీస్తున్నట్లు తెలుస్తోంది. శాఖలవారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ నీలం సాహ్నీ సమీక్షలు జరపనున్నారు. క్రమబద్దీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇది నిజంగానే గుడ్‌న్యూస్‌గా భావిస్తున్నారు. అయితే, శాఖలవారీగా వివరాలు సేకరించి.. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉండగా…. సీనియార్టీని బట్టి క్రమబద్దీకరిస్తారా.. లేక ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నది ఉద్యోగుల్లో ఉత్కంఠ రేపుతోంది.