నువ్వు టీడీపీలో చేరితే నేను వైసీపీలో చేరతా!

విశాఖ: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పార్టీలో టిక్కెట్ దక్కని వారు మరో పార్టీలో చేరుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరేందుకు సిద్ధమౌతుండగా, అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసానికి వచ్చి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. […]

నువ్వు టీడీపీలో చేరితే నేను వైసీపీలో చేరతా!

Updated on: Mar 09, 2019 | 9:09 AM

విశాఖ: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పార్టీలో టిక్కెట్ దక్కని వారు మరో పార్టీలో చేరుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరేందుకు సిద్ధమౌతుండగా, అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసానికి వచ్చి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇరువురు నాయకులు 2014కు ముందు కొంతకాలం వైసీపీలో పనిచేసి బయటకొచ్చేశారు. ఇప్పుడు వీరిద్దరూ చెరో పార్టీలో చేరనుండటంతో విశాఖ రాజకీయాలు సమూలంగా మారిపోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.