Devil Tree: విశాఖపట్నంలో దెయ్యం చెట్టు.. పేరు వింటేనే హడలిపోతున్న జనాలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

|

Oct 13, 2021 | 9:23 AM

Devil Tree: సాధారణంగా రోడ్డు పక్కన కనిపించే పచ్చని చెట్లు, సువాసనలు వెదజల్లే పూలు ఎవరికైనా ఆహ్లాదాన్నిస్తాయి. మనసును తేలికపరుస్తాయి. కానీ సాగర తీర నగరమైన విశాఖ వాసులు మాత్రం..

Devil Tree: విశాఖపట్నంలో దెయ్యం చెట్టు.. పేరు వింటేనే హడలిపోతున్న జనాలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Devil Tree
Follow us on

Devil Tree: సాధారణంగా రోడ్డు పక్కన కనిపించే పచ్చని చెట్లు, సువాసనలు వెదజల్లే పూలు ఎవరికైనా ఆహ్లాదాన్నిస్తాయి. మనసును తేలికపరుస్తాయి. కానీ సాగర తీర నగరమైన విశాఖ వాసులు మాత్రం.. ఆ చెట్ల పూలను చూడటానికి గానీ, వాసన పీల్చడానికి గానీ అస్సలు ఇష్టపడటం లేదు. డెవిల్ ట్రీ గా పిలవబడే ఆ చెట్టుని చూస్తేనే చాలు హడలిపోతున్నారు. ఆ చెట్టుకు దూరంగా వెళ్లిపోతున్నారు. విశాఖ వాసులను అంతగా భయపెడుతున్న ఆ డెవిల్ ట్రీ కథేంటో ఓ లుక్కేయండి.

సాగర తీరం విశాఖ నగరంలో అదో పచ్చటి చెట్టు. ఏడాది పొడవునా కొమ్మలు, రెమ్మెలతో కళలాడుతుంది. సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు అదే చెట్టు వైజాగ్ వాసులను వణికిస్తుంది. పచ్చని మెక్కలు, పూల వనాలు విశాఖకు గ్రీన్ సీటీ గా పేరు తెచ్చాయి. హుద్ హుద్ తరువాత వన సంపద ను కోల్పోయిన విశాఖను పునరుద్దరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీన్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ క్రమంలోనే నగరంలో పలు కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడాకులపాల చెట్లు నాటింది అప్పటి ప్రభుత్వం. ఆల్ స్టోనీయా స్కోలరీస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ రకం మొక్క అతి తక్కువ సమయంలో ఏపుగా పెరుగుతూ నిత్యం పచ్చగా ఉంటాయి. భూమి నుంచి తక్కువ నీటిని తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో త్వరితగతిన పచ్చదనం నింపేందుకు సిటీ అంతటా దాదాపుగా 5 లక్షల కు పైగా మొక్కలను నాటింది అప్పటి ప్రభుత్వం. అవి కాస్తా ఏపుగా పెరిగి పూత దశకు చేరుకున్నాయి.

అంతా బాగానే వుంది అనుకున్నారు. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ఈ చెట్ల పొదల నుంచి వెదజల్లే పుప్పుడు వల్ల మనుషుల్లో వికారం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయంటున్నారు వృక్ష శాస్త్ర నిపుణులు, పర్యావరణవేత్తలు. ఆ పూల వాసనకు ఆస్తమా వంటి శ్వాససంబంధమైన వ్యాదులు ఉన్న వారికి మరింత ఎక్కువవుతుందని చెప్తున్నారు. ఈ విషయం అనేక పరిశోధనల్లో తేలిందని అంటున్నారు విశాఖ ఆంధ్రాయూనివర్సిటీ బోటనీ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ పడాల్. ఢిల్లీ, నొయిడాల్లో ఇప్పటికే ఈ చెట్లు తొలగించినట్లు చెబుతున్నారు.

శీతాకాలం ప్రారంభంలో ఈ చెట్టు పూతకు వస్తుంది. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నవంబర్ మధ్య ఎక్కువగా పూస్తుంది. అయితే పూతకు వచ్చే సమయంలో ఆ పూతను తొలగిస్తే ఈ చెట్టు వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని సూచిస్తున్నారు నిపుణులు. జనావాసాలు, పార్కులు, రోడ్లపక్కన, జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్కలు నాటకు౦డా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వృక్ష శాస్త్ర పరిశోధకులు.

కాగా, ఏడాకులు పాల చెట్టు వల్ల ఆరోగ్యానికి నష్టమేకాకుండా కొంతమేర ఉపయోగాలు కూడా ఉన్నాయంటున్నారు వృక్ష శాస్త్ర నిపుణులు. కొన్ని రకాల జ్వరాలు, డయేరియా, జాండీస్, ఒబెసిటీ, డెర్మటాలజీ సమస్యలు, హెయిర్ ఫాలోయింగ్ వంటి ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్యం లలో ఈ చెట్ల ఆకులు, పూలు, బెరడు లను మెడిసిన్‌గా ఉపయోగిస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ చెట్ల కలపను బ్లాక్ బోర్డులు, స్కూల్లో చిన్నారులు వాడే పలకల తయారీతోపాటు అగ్గిపుల్లల తయారీకి ఉపయోగిస్తారు.అయితే వీటిని జనావాసాల మధ్య కాకుండా అటవీ ప్రాంతాల్లో ఈ మొక్కలను కంచెతో ఉపయోగకరమని సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఏడు ఆకులపాల చెట్టు విషయంలో నగర వాసుల నుంచి అభ్యంతరాలు వస్తుండటంపై జీవీఎంసీ కమిషనర్ సృజన స్పందించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవమే అని తెలిపారు. ఇటీవల సీతమ్మధారలో స్థానికులు అభ్యంతరం చెప్పడంతో ఆ చెట్లను తొలగించి వేరే మొక్కలను రీప్లేస్చేశామని ఆమె చెప్పారు. అయితే వీటి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయంలో తమ వద్ద సైంటిఫిక్ ఆధారాలు లేవని అంటున్నారు. హుద్ హుద్ సమయంలో నగరంలో కోల్పోయిన గ్రీనరీని పెంపొందించేందుకు సిటీ అంతటా ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఏడాకుల పాల మొక్కలు నాటారని, ఇప్పుడు వాటన్నింటినీ తొలగించడం వీలుకాదని చెబుతున్నారు. పూత సమయంలో చెట్ల నుంచి పూలన్ తొలగిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Also read:

Danger Missed Video: వేగంగా దూసుకొచ్చిన కారు.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఇదేం రుచి రా బాబు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఐస్ క్రీమ్ దోశ.. ఎలా చేశారో చూడండి..

EPFO: కొత్తగా పెళ్లి చేసుకున్న పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్..! ఆ విషయంలో మార్పు తప్పనిసరి..