Derailed Train: విశాఖలో పట్టాలు తప్పిన రైలు.. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడిన లోకోపైలెట్.. వివరాలివే..

విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. వెనువెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఫలితంగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు..

Derailed Train: విశాఖలో పట్టాలు తప్పిన రైలు.. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడిన లోకోపైలెట్.. వివరాలివే..
Derailed Visakhapatnam Kirandul Express

Updated on: Jan 17, 2023 | 12:33 PM

విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. వెనువెంటనే లోకోపైలెట్(రైలు డ్రైవర్) అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఫలితంగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్దరణకు ఏర్పాట్లు  ప్రారంభమయ్యాయి.  ఈ రోజు(జనవరి 17) ఉదయం విశాఖపట్నం జిల్లాలోని కాశీపట్నం దగ్గర విశాఖ –కిరండల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైలు ప్రయాణీకులలో ఏ ఒక్కరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

రైలు పట్టాలు తప్పడంతో ఒక భోగి పక్కకు ఒరిగిందని, అయితే రైలు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయి పెను ప్రమాదాన్ని తప్పించాడని వారు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల రాకపోకలకు పునరుద్దరణ  ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

కాగా, కొండ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతలున్న సమయాల్లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఓవైపు పండుగ, మరోవైపు ఈ సీజన్‌లో విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆందోళనకు గురయ్యారు ప్రయాణీకులు. కానీ, ఎలాంటి నష్టం జరగకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..