Andhra Pradesh: ఛీ.. ఛీ.. వీడిని ఏమనాలి.. అంతటి నీచానికి దిగజారాడు.. వాడికి తగిన శాస్తే జరిగింది..

| Edited By: Shaik Madar Saheb

Jun 28, 2024 | 1:32 PM

సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. నమ్మిన వారి నుంచి కూడా ఆడపిల్లలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆడపిల్ల ఉంటే.. ఏ సమయంలో ఎవరి ముప్పు పొంచుకొస్తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో వెంటాడుతోంది. కొన్నిసార్లు మనిషి ఆలోచన, పైశాచికానందానికి చిన్నారులు కూడా బాధితులుగా మారుతుండడం ఇప్పుడు భయాందోళన కలిగిస్తుంది.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. వీడిని ఏమనాలి.. అంతటి నీచానికి దిగజారాడు.. వాడికి తగిన శాస్తే జరిగింది..
Crime News
Follow us on

సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. నమ్మిన వారి నుంచి కూడా ఆడపిల్లలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆడపిల్ల ఉంటే.. ఏ సమయంలో ఎవరి ముప్పు పొంచుకొస్తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో వెంటాడుతోంది. కొన్నిసార్లు మనిషి ఆలోచన, పైశాచికానందానికి చిన్నారులు కూడా బాధితులుగా మారుతుండడం ఇప్పుడు భయాందోళన కలిగిస్తుంది. కనీసం చిన్నపిల్లలని కూడా కనికరించకుండా అఘాయిత్యానికి పాల్పడే.. మానవ మృగాలు మన చుట్టూ ఉన్నాయి.. చట్టం న్యాయం ఉన్నాయి కాబట్టే.. అలాంటి వారికి తగిన శిక్షలు పడుతున్నాయి.. కొందరిలోనైనా భయం పుడుతుంది.  బాధితులకు న్యాయం జరుగుతోంది. మూడేళ్ల క్రితం విశాఖపట్నంలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పొక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూలై 2021లో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసు నమోదయింది. మర్రి పాలెం ప్రాంతంలో ఐదేళ్ల బాలిక తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. లైన్మెన్ గా పనిచేస్తున్న అప్పన్న.. వారి పక్కింట్లోనే అద్దెకు నివాసం ఉండేవాడు. జూలై 1 2021 మధ్యాహ్నం.. బాలికను అప్పన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఆ బాలిక.. ఇంటికి వచ్చి నొప్పితో ఏడవడంతో.. ఏంటని తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని తెలుసుకొని గుండెలు పట్టుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షాధారాలను సేకరించి కోర్టులో చార్జ్ షిట్ ఫైల్ చేశారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు నిందితుడు అప్పన్నను దోషిగా తెలుస్తూ శిక్ష ఖరారు చేసింది. అప్పన్నకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు అయిదు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం. బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసులో నిందితుడికి కన్వెన్షన్ పడడానికి ప్రతిభ కనబరిచిన స్పెషల్ ఫోక్సోపీ కరణం కృష్ణకు, పోలీస్ అధికారులకు సిపి రవిశంకర్ అయ్యనార్ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..