
ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ అందింది. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ రాక సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. దర్శనం తర్వాత ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు కోహ్లీ. తర్వాత పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు. కోహ్లీ రాకతో ఆలయంలో సందడి నెలకుంది. శనివారం విశాఖలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్‌ను సొంతం చేసుకుంది. సౌతఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లీ..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.